ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎస్సీ జేఏసీ, బీసీ జనసభ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, పాల్గొన్నారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత ఎంతైనా ఉందని బీఎస్ రాములు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలోనే ఫెడరల్ స్ఫూర్తి ఉందన్నారు.
రాష్ట్రాలకు మరిన్ని హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పడాలని అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రంలో రైతులు, మౌలికపరమైన అంశాలపై సీఎం కేసీఆర్ సమాఖ్య కూటమిని ముందుకు తెచ్చారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాయని పలువురు నేతలు అన్నారు.