పొద్దుటూరు ఎస్సీ రైతుల భూమి హక్కులను రక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ను రైతు సంఘం ఆశ్రయించింది. ఎస్సీ రైతులతో 70 ఏళ్లకు పైగా భూములను సాగు చేసుకుంటున్నారని.. వారికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించింది.
వారి హక్కులను కాపాడని పరిస్థితి రాష్ట్రంలో కొనసాగటం దురదృష్టకరమని సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ రైతులు చేసిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని.. హక్కుల సంరక్షణలకు కఠిన నిర్ణయాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ సలహాలు తీసుకుంటే మీకే మంచి పేరు: జగ్గారెడ్డి