ETV Bharat / state

ఇక నుంచి 'ఈ- ఆఫీస్​' ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సేవలు - online compliants

హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ కార్యాలయంలో సిబ్బందికి 'ఈ- ఆఫీస్​' శిక్షణ నిర్వహించారు. ఇక నుంచి కమిషన్​ పూర్తి సేవలు ఈ- ఆఫీస్​ ద్వారా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ తెలిపారు. ఈ- ఆఫీస్​ ద్వారా మెరుగైన సేవలందించి న్యాయం చేస్తామని వివరించారు.

sc and st commission chairmen errolla srinivas started e-office training
ఇక నుంచి 'ఈ- ఆఫీస్​' ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సేవలు
author img

By

Published : Jul 3, 2020, 5:30 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని సమస్యల సత్వర పరిష్కారానికి 'ఈ- ఆఫీస్'​ కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​కు అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి... ఇక నుంచి ఈ- ఆఫీస్​ సేవలను వినియోగించుకునే దిశగా కమిషన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ బషీర్​బాగ్​లోని కమిషన్ కార్యాలయంలో సిబ్బందికి ఎన్​ఐసీ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ-ఆఫీస్​ ద్వారా కమిషన్ మరింత పారదర్శకంగా, వేగంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఛైర్మన్​ తెలిపారు. కార్యాలయానికి రానవసరం లేకుండా ఈ-మెయిల్ ద్వారా గానీ లేదా పోస్టు ద్వారా గానీ ఫిర్యాదులను పంపవచ్చని తెలిపారు. సమస్యలను ఈ- ఆఫీస్​ ద్వారా సత్వరమే పరిష్కరించి ఎస్సీ, ఎస్టీలకు కమిషన్​పై ఉన్న బరోసాను నిలబెట్టుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కమిషన్ సెక్రటరీ పాండ దాస్, డీడీ లావణ్య, రిటైర్డ్ జేడీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.