హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 15 పులులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా రూ. 15,00,000 చెక్కును ఆర్. శోభా, హోఎఫ్ఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు అందజేశారు.
పులుల సంరక్షణలో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుందని ఓం ప్రకాశ్ మిశ్రా అన్నారు. టైగర్స్, జూ పార్క్ నిర్వహణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో కూడా ఎస్‌బీఐ టైగర్లను దత్తత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'దూద్ దురంతో 4 కోట్ల లీటర్లు దాటిన పాల రవాణా'