సామాజిక బాధ్యత కింద హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లోని 15 పులులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకుంది. ఈ మేరకు జూపార్క్‌లో జరిగిన కార్యక్రమంలో అటవీ ప్రధాన సంరక్షణాధికారి శోభకు ఎస్బీఐ అధికారులు రూ.15 లక్షల చెక్ అందించారు. వరుసగా ఆరో ఏడాది పులులను దత్తత తీసుకునేందుకు ముందుక వచ్చిన ఎస్బీఐని అటవీశాఖ అధికారులను అభినందించారు.
జూపార్క్‌లో వన్యప్రాణులను దత్తత తీసుకునేందుకు ఇతర బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఎస్బీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో నిర్వహణ, జంతువులను జాగ్రత్తగా చూసుకుంటున్న తీరు తమను ఆకట్టుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక జంతుప్రదర్శనశాలలను సందర్శించానని... నెహ్రూ పార్క్ మాత్రం అన్ని అంశాలలో ఉత్తమమైనదని అధికారులు ప్రశంసించారు.
ఇవీ చూడండి: షాద్‌నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు