ఇటీవల వరదల మూలంగా నష్టపోయిన కుటుంబాలకు కొకకోలా ఫౌండేషన్, సేవ్ ద చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా నిత్యావసర సరుకులను అందజేశారు. తుకారం గేట్ మాంగరి బస్తీలో దాదాపు 112 కుటుంబాలకు ఆహార సామాగ్రి, హైజిన్ కిట్లు, విద్యార్థులకు కావాల్సిన ఎడ్యుకేషన్ కిట్లను... పోలీసుల సహకారంతో పంపిణీ చేసినట్లు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ మేనేజర్ ప్రశాంతి తెలిపారు.
వరదబాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా... నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 11వేల 200 కుటుంబాలకు ఈ సహాయాన్ని అందజేసినట్లు వారు వెల్లడించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పొదుపు మంత్ర... సౌరవిద్యుత్‌తో కోట్లు ఆదా