ETV Bharat / state

వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌

వనస్థలిపురంలో అధునాతన హంగులతో కూడిన శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) టెండర్లను ఆహ్వానించింది. తొలిదశలో రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు బస్‌బేల పనుల్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది.

వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌
వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌
author img

By

Published : Dec 21, 2020, 7:33 AM IST

హైదరాబాద్‌ వనస్థలిపురంలో అధునాతన హంగులతో కూడిన శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) టెండర్లను ఆహ్వానించింది. తొలిదశలో రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు బస్‌బేల పనుల్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. తర్వాత దశలవారీగా మిగిలిన నాలుగింటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

1.2 కి.మీల విస్తీర్ణంలో..

ఎల్బీనగర్‌ నుంచి రోజు 25వేల - 30వేల మంది ప్రయాణికులు నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. 600-700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఎక్కడ పడితే అక్కడ నిలిపేస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇటీవల ప్రారంభించిన పైవంతెనపై నుంచి వచ్చే వాహనాలు బస్సులు ఆగే చోట దిగుతున్నాయి. రద్దీ మరింత పెరిగింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు హరిణవనస్థలి పార్కు సమీపంలోని ప్రధాన రహదారి పక్కన శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ను అందుబాటులోకి తేవాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. రూ.18 కోట్ల అంచనా వ్యయంతో 1.2 కి.మీ.ల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.

సకల సౌకర్యాలతో..

మొత్తం 6 బస్‌బేలుంటాయి. సిటీ బస్సుల కోసం ప్రత్యేక బే ఉంటుంది. ప్రతిదాంట్లోనూ ఏసీ, నాన్‌ ఏసీ నిరీక్షణ గదులు. కరోనా మార్గదర్శకాల ప్రకారం ఏసీ నిరీక్షణ గదిలో 21 మంది, నాన్‌ ఏసీ లో 48 మంది కూర్చోవచ్ఛు 490 కిలోవాట్స్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌, నీటిని శుద్ధి కేంద్రాలు, పార్కింగ్‌ వసతి, ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం, 2 ఏటీఎంలు, బుక్‌స్టాల్స్‌, ఫుడ్‌ కోర్టులను అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రాజెక్టును 3 భాగాలు విభజించారు.

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని అమ్మలా కాపాడుకుంటా: గవర్నర్​ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.