భాగ్యనగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... ప్రత్యేక జాగ్రత్తల నడుమ పూజ చేస్తున్నారు. కోఠి బ్యాంక్ స్ట్రీట్లో తెరాస నాయకుడు ఆర్వీ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిరుపేదల ఆకలి తీర్చారు. ప్రతి ఏడాది అంగరంగా వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలను కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ ఛైర్మన్ ప్రసన్న, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమత గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారత వైద్య విద్యార్థులకు షాక్.. హౌస్ సర్జన్ చేసేందుకు నిరాకరణ