ETV Bharat / state

తెలంగాణలో సంక్రాంతి సంబురం - ఆకట్టుకుంటున్న రంగవళ్లులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 6:54 AM IST

Updated : Jan 14, 2024, 8:47 AM IST

Sankranti Celebrations in Telangana 2024 : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల్లో ఉన్నవారు సైతం సొంతూళ్లకు చేరుకోవడంతో, పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఎటు చూసినా రంగురంగుల ముత్యాల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. లోగిళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రప్రజలకు పలువురు ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Sankranti Celebrations in Telangana 2024
Sankranti Celebrations
తెలంగాణలో సంక్రాంతి సంబురం - ఆకట్టుకుంటున్న రంగవళ్లులు

Sankranti Celebrations in Telangana 2024 : సంక్రాంతి అంటేనే సందడి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ మూడురోజులు సందడి వాతావరణం నెలకొంటుంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకులు అంబారాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద అందరు కలిసి ఆనందంగా గడుపుతున్నారు. సంక్రాంతి సెలవులు రాగానే అవకాశం ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. అవకాశం లేనివారు సంక్రాంతి పండుగని ఇక్కడే జరుపుకుంటున్నారు.

Sankranti Festival 2024 Celebrations In Telangana : అటువంటి వాళ్లకు పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసిన మనసుకు ఉల్లాసాన్ని అందించే పచ్చని చెట్లు, బోటు షికారు ఇలా అన్నీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారని సందర్శకులు చెబుతున్నారు. పల్లెటూరు ఎలా ఉంటుందో అలాగే ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు.

పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు - బోగి మంటల మధ్య విద్యార్థుల నృత్యాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది. హనుమకొండ జిల్లా పరకాలలో వివిధ పాఠశాలలు, కళాశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ముందుగానే నిర్వహించారు. కొందరు వినూత్న రీతిలో ఆలోచించి తమ అభిప్రాయాలను ముగ్గుల రూపంలో వేశారు. రమాదేవి అనే మహిళ ఆడపిల్లలకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ తన మనసులోని భావాలను ముగ్గురూపంలో వ్యక్తపరిచారు.

Makar Sankranti 2024 : తెలుగు ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతుల సంక్రాంతి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రప్రజలకు మాజీమంత్రి హరీశ్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగిమంటలు ప్రజల జీవితాల్లో చీకట్లు పారదోలాలని ప్రార్థించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్న ఆయన, అయోధ్యలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములమయ్యే అవకాశం సిద్దిపేటవాసులకు దక్కడం పూర్వజన్మ సుకృతమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అన్నప్రసాద వితరణ కోసం సరుకులతో వెళ్లే వాహనాలను ఆయన ప్రారంభించారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో, సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే తెప్పల పోటీలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలి - హ్యాపీ సంక్రాంతి : సీఎం రేవంత్​ రెడ్డి

Sankranti Celebrations in Hanamkonda : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరుగుతున్న శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సంక్రాంతి సందర్భంగా ఈ మూడు రోజులు భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో నిర్వహించిన చిందు యక్షగాన ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు రాగా, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. నిర్మల్‌లో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు మంగళవాద్యాల నడుమ వేడుక కనులపండువగా సాగింది.

సంక్రాంతి విశిష్టత ఏమిటి - దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు?

సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Last Updated : Jan 14, 2024, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.