Sankranti celebrations at Mallareddy University : మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, పతంగులు ఎగరేయడంలో విద్యార్థులు పోటీపడ్డారు. ఇదే క్రమంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని ఐదో పాటను ఇదే యూనివర్సిటీలో మంత్రి మల్లారెడ్డితో పాటు చిత్ర బృందం విడుదల చేసింది. సినీ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నిర్మాత రవి, నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పాల్గొని విద్యార్థులతో స్టెప్పులేశారు. వీరితోపాటు నటుడు సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు పాటలతో ఆడిపాడి అందరినీ అలరించాడు.
చదువుతో పాటు, మానసిక ఉల్లాసం తోడయ్యే కార్యక్రమాలతో విద్యార్థుల్లో నూతనుత్తేజం సంతరించుకుంటుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. విద్యాలయంలో వేసిన ముగ్గులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను అందుకున్నారు.
"మల్లారెడ్డి కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున పిల్లల కోసం ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ కళ్లల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తే నా జన్మ ధన్యం అయిపోయింది. చదువుతో పాటు మానసిక ఉల్లాసం తోడవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. దాదాపు 25 వేల మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది."- మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
ఇవీ చదవండి: