Sankranti Celebrations 2024 in Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు సంక్రాంత్రి(Sankranti) సంబరాల్లో మునిగిపోయారు. వేకువజామునే నిద్రలేచి భక్తిపారవశ్యంలో ఊయలలూగారు. పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ఐనవోలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పండగను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని స్వగృహంలో వేడుకలు జరిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంక్రాంతికి అంగళ్లు కిటకిట- అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డూలకు మంచి డిమాండ్
రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ పాడిపంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పతంగుల పండుగ హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని పలుచోట్ల పతంగుల పండుగను నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రజలతో కలిసి పతంగుల వేడుకలో పాల్గొన్నారు.
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ - వాహ్వా అనిపిస్తున్న 'ఘేవర్' మిఠాయి గురించి తెలుసా?
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా యువకులతో కలిసి గాలి పటాలను ఎగురవేశారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహబూబాబాద్‌లో బొమ్మల కొలువును వైభవంగా జరిపారు. గౌరమ్మను వేదమంత్రోచ్ఛరణల నడుమ, విశేష అలంకరణలతో పూజించారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో నదీ తీరాన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎడ్ల పందేలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్దసంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
"రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని కోరుకున్నాను. స్వామి వారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ పాడిపంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నాను". - పొన్నం ప్రభాకర్, రవాణాశాఖ మంత్రి
కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? - పూర్వీకులు చెప్పిన మాట నిజమేనా?