ఎల్బీనగర్లోని చిత్రా లేఅవుట్ కాలనీలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిత్రా లేఅవుట్ వేల్పేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉదయం కాలనీవాసులందరూ భోగి మంటలు పెట్టారు. గంగిరెద్దులాటతో సంతోషంగా గడిపారు.
ప్రతి సంవత్సరంలానే ఈ సంక్రాంతి పండుగను కాలనీవాసులమంతా ఒకే కుటుంబంలా జరుపుకున్నామని కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి తెలిపారు. నోరూరించే సంప్రదాయ వంటకాలతో, తెలుగు సంస్కృతిని చాటే ప్రదర్శనలతో ఆహ్లాదంగా గడిపామని చెప్పారు.