నల్లకుంట ఠాణా పరిధిలోని శంకర్‌మఠ్‌లో ఈనెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం చేసింది శంకర్‌మఠ్‌లో కార్యాలయ సహాయకుడిగా పనిచేస్తున్న రాళ్లబండి నాగ సాయిరామ్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.
అసలు ఏం జరిగింది
శంకర్‌మఠ్ ఆలయ నిర్వాహకులు ఆలయంలోని శారదాంబ విగ్రహాన్ని పసిడి చీరతో అలంకరించాలని నిర్ణయించారు. అందుకోసం దాతల నుంచి విరాళాలు సేకరించారు. దాతల నుంచి వచ్చిన విరాళాలను ఆలయ నిర్వాహకుడి అల్మారాలో భద్రపరిచారు.
సొత్తుపై కన్నేశాడు
కార్యాలయంలో అన్ని విషయాలు తెలిసిన సహయకుడు సాయిరామ్‌కు వక్రబుద్ధి పుట్టింది. అల్మారాలో సొత్తను కాజేయాలని పథకం వేశాడు. రహస్యంగా అల్మారా తాళాలు దొంగిలించి విరాళంగా వచ్చిన సొత్తు ఎత్తుకెళ్లాడు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. నిందితుడి నుంచి 250 గ్రాముల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7,50,000 ఉండొచ్చని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: కాసేపట్లో పెళ్లి..అంతలో ఆగిపోయింది..