ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది.. కనీస వేతనం రూ.19 వేలు చేయాలంటూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కింగ్ కోఠిలోని హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సిబ్బందికి వేతనాలు పెంచిందని... కరోనా విజృంభణలోనూ ప్రాణాలను పణంగా పెట్టి ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని విస్మరించడం అన్యాయమన్నారు. గతేడాది సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీనే అమలుచేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.17 వేలు, ఇఎస్ఏ ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.16,770, నిమ్స్‌లో రూ.15 వేలు ఇస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్యం పనులు చేస్తున్నామని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ