ETV Bharat / state

హైదరాబాద్​లో మరో గ్లోబల్​ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు.. కేటీఆర్​ హర్షం.!

New Global Capability Center In Hyderabad: హైదరాబాద్​లో గ్లోబల్​ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్న శాండోస్​ కంపెనీకి మంత్రి కేటీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్​ సైన్సెస్​ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Jan 31, 2023, 5:36 PM IST

KTR Thanked Sandoz Company For Global Capability Center: హైదరాబాద్​కు మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం రానుంది. అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​ లేబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తెలిపింది. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్​లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న శాండోస్ కంపెనీకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని.. ఈ రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్​ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్​తో సమావేశమైన కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రకటించింది.

శాండోస్​ ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్​

ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్​ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచస్థాయి లేబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్​లో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.

ఇప్పటికే తమ సంస్థ 1000కు పైగా మాలిక్యుల్స్​ని కలిగి ఉన్నదని, దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జిస్తోందని.. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న కంపెనీ ప్రతినిధి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. తమ కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా సాండోస్ కంపెనీ తన గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తోందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాండోస్ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్​లోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని.. ఇదే స్థాయిలో సాండోస్ కంపెనీ కూడా తన కార్యకలాపాలను ఇక్కడే విస్తరిస్తుందన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ పలు వివరాలు అందజేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ గురించి తెలిపారు.. సాండోస్ లాంటి కంపెనీకి ఫార్మాసిటీలో అద్భుతమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంటుందని సూచించారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.