ETV Bharat / state

ఆంధ్రా పోలీసులను చూసి... తమిళ స్మగ్లర్లు పరారీ - latest news of red sandal smuggling

రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను ఏపీ టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల బృందాన్ని చూడగానే స్మగ్లర్లు ఎక్కడి దుంగలను అక్కడే వదిలి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రా పోలీసులను చూసి... తమిళ స్మగ్లర్లు పరారీ

author img

By

Published : Jul 15, 2020, 10:24 PM IST

ఏపీ చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో తమిళ స్మగ్లర్ల అలజడి పెరుగుతోంది. కరోనాతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న శేషాచల అడవుల్లో మళ్ళీ స్మగ్లింగ్ పుంజుకుంటోంది. కట్టడికి అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. తిరుపతి మంగళం సమీపంలో తిమ్మినాయుడు పాలెం బీట్ పరిధిలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్​ఫోర్స్ బృందం మంగళం ఫారెస్ట్ గోడౌన్ వెనుక వైపు అడవుల్లో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లగా, దాదాపు 20 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కనిపించారు. వీరు పోలీస్ బృందాన్ని చూడగానే దుంగలను ఎక్కడివక్కడే వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : 60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.