ETV Bharat / state

ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..

author img

By

Published : Jan 7, 2021, 10:14 AM IST

ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగం రాక... ఓ వ్యక్తి తానే ఉపాధి వెతుక్కున్నాడు. తనతో పాటు మరికొందరికి పని కల్పిస్తున్నాడు. పీజీ చదివిన విజ్ఞానంతో వినూత్నంగా ఆలోచించి.. కష్టే ఫలి అని నమ్మి ఓ హొటల్​ పెట్టుకుని.. కుటుంబాన్ని పోషించుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు
ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు

హైదరాబాద్​ నగర శివారు వనస్థలీపురం.. నిత్యం రద్ధీగా ఉండే ప్రాతం సుష్మా థియేటర్​ సెంటర్​. హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాలు కిక్కిరిసి ఉంటాయి. రకరకాల షాపులు, హోల్డింగులు కనిపిస్తుంటాయి. అందులో ఓ చిన్న హొటల్​ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది. అదేదో అంతర్జాతీయ సంస్థకు చెందిన హోల్డింగ్​ కాదు. ఓ చిన్న హొటల్​ బోర్డు. అదే "నిరుద్యోగి@ఎంఏ, బీఈడీ". బోర్డు. ఉన్నత చదువులు చదివి సర్కారు కొలువు రాక... ఆంగ్ల మాధ్యమంలో చదవకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీలో లెక్చరర్​ ఉద్యోగం పోయి... లాక్​డౌన్​ ప్రభావంతో చేస్తున్న పని కోల్పోయి... ఉపాధి కోసం ఓ నిరుద్యోగి పెట్టుకున్న హోటలే. ఈ నిరుద్యోగి@ఎంఏ బీఈడీ.

వరంగల్ జిల్లా ములుగు మండలం పత్తిపల్లికి చెందిన లకావత్ సమ్ములాల్ నాయక్ ఎంఏ బీఈడీ వరకు చదువుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్​గా పనిచేశాడు. అయితే అతనిది ఆంగ్ల మాధ్యమం కాకపోవడం వల్ల అదీ పోయింది. భార్యాబిడ్డలను తీసుకుని ఉపాధికోసం నగరానికొచ్చి చిన్నా చితకా పనులు చేసుకున్నాడు. లాక్​డౌన్​ వల్ల అదీ పోయింది.

కష్టేఫలి అనుకున్న నాయక్​ వనస్థలీపురంలోని సుష్మా సెంటర్​లో ఓ హోటల్​ పెట్టుకున్నాడు. తాను ఉపాధి పొందడమే కాదు. మరో ఇద్దరికి పని కల్పించాడు. ఉద్యోగం రాలేదని దిగులు చెందకుండా ఉపాధి మార్గాలు ఆలోచించి.. తెలివితేటలను స్వయం ఉపాధిలో నిరూపించుకోవాలని అంటున్నాడు నాయక్​.

ఇదీ చూడండి: పాలకుర్తి ఎస్​ఐని అభినందించిన గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.