Sammakka Sarakka Tribal University Bill Lok Sabha : విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితా(Central Universities List)లో ఈ వర్సిటీ పేరును కూడా చేర్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు.
Telangana Tribal University Bill Introduced in Lok Sabha : ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపింది. గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఈ విషయాల్లో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది బాటలు వేస్తుందని వివరించింది. గిరిజనుల చదువులపై దృష్టి సారించడంతో పాటు కేంద్ర యూనివర్సిటీలు చేసే ఇతర కార్యకలాపాలనూ ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని పేర్కొంది.
Tribal University in Telangana : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అని వివరించింది. ఇందుకోసం 2009 కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించి అందులో 'సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ' పేరును చేర్చుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) ఏడు ఏళ్లలో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.
Sammakka Sarakka Tribal University : HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుంచి తరగతులు!
రాష్ట్ర ప్రజలు 9 ఏళ్లగా ఎదురుచూస్తున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాల్లో(Central Tribal University) ఇది మూడోవది కానుంది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ వర్గాలు అభిప్రాయపడుతోంది. తాత్కాలిక క్యాంపస్ కోసం ములుగు జిల్లా జకారంలోని యువజన శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు నాలుగేళ్ల క్రితమే సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.
Sammakka Sarakka University Seats : రాష్ట్రానికి చెందిన గిరిజనులకు కేంద్రీయ వర్సిటీలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనే తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర వర్సిటీ ప్రవేశాల్లో ప్రత్యేక స్థానిక రిజర్వేషన్లు లేవని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ రకమైన వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు ఉంటాయని గిరిజన సంక్షేమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా ఓ కీలక అడుగు ముందుకు పడి కేంద్ర సర్కార్ పార్లమెంటులో ఈ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టింది.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని