సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద డ్రాయింగ్, క్రాఫ్టింగ్, మ్యూజిక్, పీఈటీ ఉపాద్యాయుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... ఆ ఉపాద్యాయులు ఆందోళనకు దిగారు. తెలంగాణ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో... లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. మార్చి నుంచి ఇప్పటి వరకు తమని విధుల్లోకి తీసుకోకుండా రెన్యువల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఇవ్వాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రానికి పంపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో జీతాలు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించిన దృష్ట్యా... తక్షణమే పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించి... విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.