చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రెట్ తరలింపు అంశంపై రసాయనాన్ని కోలుగోలు చేసిన సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ ఛైర్మన్ జయరాం రెడ్డి స్పందించారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఇందులో ఎలాంటి గోప్యత, భయాలు అవసరం లేదని వెల్లడించారు. భద్రత పరంగానూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... భయాందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల బీరూట్‌లో జరిగిన భారీ ప్రమాదం నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు, నిల్వ, భద్రతా అంశాలపై సాల్వే ఎక్స్‌ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ జయరామ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇదీ చూడండి: పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానం.. మెరుగుపడనున్న పారదర్శకత