ETV Bharat / state

కరోనా ఔషధం పేరుతో నకిలీ మందులు విక్రయం - hyderabad crime news

ప్రజలను వణికిస్తున్న కరోనా నివారణకు నేటికీ ఔషధం లేదు. ఈ తరుణంలో ప్రజల భయాన్ని సొమ్ము చేసుకునేందుకు ఓ ముఠా కోవిడ్ అభయ పేరిట నకిలీ దందాకు తెర లేపింది. ఆన్‌లైన్‌లో నకిలీ మందులు విక్రయిస్తురన్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు.

Sale of counterfeit drugs for corona
కరోనా ఔషధం పేరుతో నకిలీ మందులు విక్రయం
author img

By

Published : Apr 17, 2020, 5:03 AM IST

Updated : Apr 17, 2020, 7:17 AM IST

కోవిడ్‌ వైరస్‌ కట్టడికి తమ వద్ద మందులు ఉన్నాయంటూ కొందరు కేటుగాళ్లు అక్రమాలకు తెరలేపారు. కొవిడ్‌ అభయ పేరిట నకిలీ ఔషధాలు తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సొంటి, అల్లం తదితర మిశ్రమాలతో చూర్ణం తయారు చేసి... రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్‌ సోకకుండా ఉంటుందని గోడ పత్రికల ద్వారా ముఠా సభ్యులు విస్తృత ప్రచారం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా చూర్ణం డబ్బాలను విక్రయించారు. ఒక్కో డబ్బాను రూ. 280 చొప్పున అమ్మారు.

కరోనా ఔషధం పేరుతో నకిలీ మందులు విక్రయం

బత్తిని సోదరుల పేరిట..

చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరుల పేరిట ముఠా ఈ ఆగడాలకు పాల్పడింది. అయితే ఈ విషయం బత్తిని కుటుంబ సభ్యుల దృష్టికి రావడం వల్ల అసలు విషయం బయటకొచ్చింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.

ఎలా దొరికారంటే...

ఆన్‌లైన్‌ ద్వారా చూర్ణం కొనుగోలు చేశారు. తద్వారా ముఠా చేస్తున్న మోసం తేటతెల్లమైంది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ కేంద్రంగా ఈ దందాను సుబ్బారావు, రాజ్‌కుమార్‌, ఉదయ్‌భాస్కర్‌, మహేంద్ర అను వారు కొనసాగిస్తున్నట్టు విచారణలో తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సతీశ్​ రెడ్డి అనే మరో వ్యక్తి పేరు బయటకొచ్చింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ ముఠాతో తమకు ఎటువంటి సంబంధం లేదని బత్తిని అమర్‌నాథ్​గౌడ్‌ స్పష్టం చేశారు.

ప్రజలు ఈ తరహా మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అనుమానం వస్తే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

Last Updated : Apr 17, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.