Salaar Movie Ticket Price Hike : కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రానికి తెలంగాణలో భారీగా టికెట్ ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఈ చిత్రాన్ని ఇతర భాషలతో పాటు తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తరహాలో సాధారణ థియేటర్లలో గరిష్టంగా రూ.50, కనిష్టంగా రూ.30, మల్టీఫ్లెక్స్‌లలో గరిష్టంగా రూ.100, కనిష్టంగా రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని మైత్రీ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
'సలార్' ప్రైజ్ హైక్- యూఎస్‌లో 25వేల టికెట్లు సోల్డ్- మల్టీప్లెక్స్‌లో ధర ఎంతంటే?
Salaar Movie Ticket Issue in Telangana : సలార్ సినిమా టికెట్ల పెంపునకు(Salaar Movie Ticket Hike) ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో సలార్ టికెటింగ్ బుకింగ్స్‌ను ప్రారంభించలేదని సలార్ పంపిణీదారులు చెబుతున్నారు. ఒకవేళ ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తే సలార్‌కు మొదటి వారం రోజులు మల్టీఫ్లెక్స్‌లు, సాధారణ థియేటర్లలో భారీగా టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బుక్ మై షో(Book My Show) ద్వారా మల్టీఫ్లెక్స్‌లో టికెట్ బుక్ చేసుకుంటే సేవా రుసుముతో కలిపి రూ.450లుగా ఉండే అవకాశం ఉంది.
Rajmouli Bought Salaar Movie Ticket Price : సింగిల్ స్క్రీన్ థియేటర్ల(Salaar Price in Single Screen Deaters Telangana)లో రూ.210 వరకు సలార్ టికెట్ ధరలు ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా కన్నడలో నిర్మించడం వల్ల తెలుగులో అనువాద చిత్రంగా చిత్రబృందం భావిస్తున్నారు. దీంతో అనువాద చిత్రానికి ఆర్ఆర్ఆర్ స్థాయిలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా తొలి టికెట్‌ను దర్శక దిగ్గజం రాజమౌళి రూ.10,116లకు కొనుగోలు చేయడం సలార్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కనీవినీ ఎరుగని రీతిలో ప్రభాస్‌కు 'ఎయిర్ సెల్యూట్'- రెబల్ స్టార్ ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన
Salaar Movie Second Trailer Date : డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనున్న సలార్ సినిమాపై సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. మరో ట్రైలర్‌ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫస్ట్ ట్రైలర్‌లో స్నేహం గురించి దర్శకుడు చూపించారు. రానున్న ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నారు. శృతిహాసన్, పృథ్విరాజ్‌సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ నిడివి 2 గంటల 55 నిమిషాలు ఉంది.
ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ- 'సలార్' రెండో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
100 టికెట్లతో సలార్ మిడ్నైట్ షోకు యంగ్ హీరో రెడీ- జక్కన్న బోణీ!