ETV Bharat / state

ఎస్​సీఎస్​సీ యాప్​ను ప్రారంభించిన సజ్జనార్...

మహిళా ఉద్యోగుల కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ (ఎస్​సీఎస్​సీ) ఆధ్వర్యంలో నూతనంగా సేఫ్ ఈ లెర్నింగ్ (సేఫ్) యాప్​ను రూపొందించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఉద్యోగిణులను ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎస్​సీఎస్​సీ యాప్​ను ప్రారంభించిన సజ్జనార్... వేధిస్తే కఠిన చర్యలు

author img

By

Published : Sep 12, 2020, 11:20 PM IST

మహిళా ఉద్యోగుల కోసం రూపొందించిన సేఫ్ ( సేఫ్టీ అవేర్​నెస్ ఫర్ న్యూ హైర్ ఎంప్లాయిస్ ) యాప్​ను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. మహిళల రక్షణకు యాప్​ను ప్రారంభించడం ఆనందంగా ఉందని.. కొవిడ్ సమయంలో సైబర్ క్రైం, మహిళల వేధింపుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

కొత్తగా చేరే ఉద్యోగిణులకు...

తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే మహిళా ఉద్యోగులకు ఈ సేఫ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ వెల్లడించారు. (ఎస్​సీఎస్​సీ) సహకారంతో మహిళల కోసం ఇప్పటికే మార్గదర్శక్, సంఘమిత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్​సీఎస్​సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం అనేక రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఈలెర్నిగ్ మాడ్యూల్ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం పనిచేస్తుందని సీపీ పేర్కొన్నారు.

జాగ్రత్తలు ఉంటాయి...

సేఫ్ ఈ లెర్నింగ్ యాప్​లో కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళలు.. తాము పనిచేస్తున్న చోట వారి భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరిచారని వివరించారు. మహిళా ఉద్యోగస్తుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే అంశాలు ఉంటాయన్నారు.

వేధిస్తే కఠిన చర్యలే...

మహిళా ఉగ్యోగుల రక్షణ కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. కొత్తగా విధుల్లో చేరిన మహిళా ఉద్యోగిణులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీపీ అనసూయ, ఎస్​సీఎస్​సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఐటీ, ఫార్మా, ఇండస్ట్రీల మేనేజర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దిగంబరంగా ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనం.. అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.