ప్రముఖ నృత్య గురువు ఆనంద్ శంకర్ జయంతి శిష్యురాలు చిన్నారి సహన సుందర్ భరతనాట్య అరంగ్రేటం అంగరంగం వైభవంగా సాగింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో సహన సుందర్ నృత్య ప్రదర్శన చేశారు. పుష్పాంజలితో నృత్యం ఆరంభించిన సహన...అలరిపు, వర్ణం, కీర్తనం, థిల్లానా లాంటి పలు అంశాలను నయన మనోహారంగా ప్రదర్శించింది.
తన ప్రతిభతో నాట్య ప్రియులను మంత్రముగ్థులను చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జిస్టిస్ గోపాల్‌రావుతో పాటు పలువురు నృత్య గురువులు, నాట్య ప్రియులు సహన సుందరని అభినందించారు.
ఇవీ చూడండి : 'సీఎం గారూ... నూతన భవనాలు కట్టాల్సిన అవసరమేంటి...?'