ETV Bharat / state

'మానవ రహిత పారిశుద్ధ్య పనులు ఆదర్శనీయం' - జాతీయ సఫాయి కర్మచారి కమిషన్​ ఛైర్మన్​ మన్హర్​ వాల్జిభాయి జాలా

జలమండలి చేపడుతున్న మానవ రహిత పారిశుద్ధ్య పనులను జాతీయ సఫాయి కర్మచారి కమిషన్​ ఛైర్మన్​ మన్హర్​ వాల్జిభాయి జాలా, జలమండలి ఎండీ దానకిశోర్​ పరిశీలించారు. కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయా లేదా అని వాల్జిభాయి ఆరా తీశారు.

'మానవ రహిత పారిశుద్ధ్య పనులు ఆదర్శనీయం'
author img

By

Published : Oct 17, 2019, 5:56 AM IST

Updated : Oct 17, 2019, 8:03 AM IST

జలమండలి చేపడుతున్న మానవ రహిత పారిశుద్ధ్య పనులను జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ మన్హర్ వాల్జిభాయి జాలా, సభ్యుడు జగదీష్ హిరేమణి, జలమండలి ఎండీ దానకిశోర్​తో కలిసి హైదరాబాద్​ ఖైరతాబాద్​లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అలాగే జలమండలి మినీ ఎయిర్ టెక్ యంత్రాలతో చేపడుతున్న క్లీనింగ్, జెట్టింగ్, వ్యర్థాలను పారబోయడం, అలాగే భారీ ఎయిర్ టెక్ యంత్రాలతో సక్కింగ్ పనులను వారు పరిశీలించారు. జలమండలి మానవ రహిత పారిశుద్ధ్య పనుల కోసం మినీ ఎయిర్ టెక్ యంత్రాలను రూపొందించి వినియోగంలోకి తీసుకువచ్చిందని ఎండీ దానకిషోర్‌ తెలిపారు. అంతేకాకుండా కార్మికులు మ్యాన్​ హోళ్లలోకి దిగకుండా సెవరెజీ పనులపై ఎప్పటీకప్పుడు వర్క్ షాపులు నిర్వహిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరికరాలను సమకూరుస్తున్నామని ఆయన వివరించారు.

జలమండలి కార్మికులకు అందిస్తున్న ఆక్సిజన్ మాస్క్​లు, గ్యాస్ డిటెక్టర్, సిల్ట్ గ్లాబర్, గ్లౌస్​తోపాటు పలు రకాల పనిముట్లను సఫాయి కర్మచారి ఛైర్మన్ మన్హర్‌ వాల్జిభాయి జాలా పరిశీలించారు. ఆ పనిముట్లు ఏ విధంగా పనిచేస్తాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా కాలానుగుణంగా కార్మికులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, నూనెలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కార్మికుల వేతనాలు సరైన సమయంలో అందడం, ఈఎస్ఐ సదుపాయాలపై కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన ఛైర్మన్ ఈ ప్రక్రియ అద్భుతంగా, ఆదర్శనీయంగా ఉందన్నారు. అనంతరం అంబర్ పేట్ ఎస్టీపీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎమ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..

TG_Hyd_06_17_Safai_Karmachari_AV_TS10017 Contributer : S NAGARAJU Note : Taja Wats APP Ph : 9346919348 ( ) జలమండలి చేపడుతున్న మానవ రహిత పారిశుద్ద్య పనులను జాతీయ సఫాయి కర్మచారి కమఅషన్ చైర్మన్ మన్హర్ వాల్జిభాయి జాలా, సభ్యుడు జగదీష్ హిరేమణి జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ తో కలిసి ఖైరతాబాద్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అలాగే జలమండలి మినీ ఎయిర్ టెక్ యంత్రాలతో చేపడుతున్న క్లీనింగ్, జెట్టింగ్, వ్యర్ధాలను పారబోయడం అలాగే భారీ ఎయిర్ టెక్ యంత్రాలతో సక్కింగ్ పనులను వారు పరిశీలించారు. జలమండలి మానవ రహిత పారిశుద్ద్య పనుల కోసం మినీ ఎయిర్ టెక్ యంత్రాలను రూపొందించి, వినియోగంలోకి తీసుకువచ్చిందని ఎండీ దానకిషోర్‌ తెలిపారు. అంతేకాకుండా సెవరెజీ కార్మికులకు ఎప్పటీకప్పుడు వర్క్ షాపులు నిర్వహిస్తూ, సాంకేతికం పరిజ్ణానంతో పాటు పరికరాలను సమకూరుస్తూ కార్మికులు మ్యాన్ హోళ్లలోకి దిగకుండా సెవరెజీ పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.జలమండలి కార్మికులకు అందిస్తున్న ఆక్సిజన్ మాస్క్ లు, గ్యాస్ డిటెక్టర్, సిల్ట్ గ్లాబర్, గ్లౌస్ తోపాటు పలురకాల పనిముట్లను సఫాయి కర్మచారి చైర్మన్ మన్హర్‌ వాల్జిబాయి జాలా పరిశీలించారు. ఆయా పనిముట్లు ఏ విధంగా పనిచేస్తాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా కార్మికులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, నూనెలు అందుతున్నాయా లేదా అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కాకుండా కార్మికుల వేతనాలు సరైన సమయంలో అందుతున్నాయా లేదా, ఇఎస్ఐ సదుపాయం కల్పించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన చైర్మన్ ఈ ప్రక్రియ అద్భుతంగా, ఆదర్శనీయంగా ఉందన్నారు. అనంతరం అంబర్ పేట్ ఎస్టీపీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎమ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.....Visuals....
Last Updated : Oct 17, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.