ETV Bharat / state

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం

రాజమహేంద్రవరంలో ఓ సాధువు మృతి చెందారు. మృతదేహాన్ని తరలిస్తుండగా అతని వద్ద లక్షా ఎనభై వేల నగదు దొరికింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయామైనదని పోలీసులు తెలిపారు.

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం
author img

By

Published : Aug 24, 2019, 2:47 PM IST

అనాథ సాధువు మృతి చెందాడు... అతని వద్ద లక్షా ఎనభై వేల నగదు బయట పడిన ఘటన రాజమహేంద్రవరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గోదావరి గట్టున మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఈ ఘటన జరిగింది. నిత్యం వివిధ గుడుల వద్ద బిక్షాటన చేస్తూ ఉండేవాడని చుట్టు ప్రక్కలవారు తెలియచేశారు. చనిపోయిన సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.... మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న సంచులు తనిఖీ చేయగా డబ్బు బయటపడ్డాయి....నిర్ఘాంత పోయిన పోలీసులు ఆ నగదు లెక్కించారు. మొత్తం లక్షా ఎనభై వేల రూపాయలుగా తేల్చారు. సాధువు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ నగదు అందిస్తామని పోలీసులు చెబుతున్నారు.

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం

ఇవీ చదవండి :విమానాశ్రయాన్ని తలపిస్తోన్న ఓరుగల్లు రైల్వే స్టేషన్​

Intro:ap_knl_22_14_fire_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ఆటోనగర్ లో ఓ పాత ప్లాస్టిక్ బాటిళ్ల గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో యంత్రం, పాత ప్లాస్టీక్ బాటిల్స్, రేకుల షెడ్ దగ్దమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రూ. 8 లక్షలు నష్టము జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు

Body:అగ్నిప్రమాదం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.