ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - Saddula Bathukamma latest news

Saddula Bathukamma Celebrations: రాష్ట్రవ్యాప్తంగాసద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. అనంతరం మహిళలు గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.

saddula bathukamma
saddula bathukamma
author img

By

Published : Oct 3, 2022, 8:49 PM IST

Updated : Oct 3, 2022, 9:53 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Bathukamma Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరువాడా.. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.

ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మలతో భారీ ప్రదర్శన: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శలు ఆకట్టుకున్నాయి.

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మలతో హుస్సేన్‌సాగర్‌ కాంతులీనింది. అనంతరం బాణసంచా ప్రదర్శన కట్టిపడేసింది. హైదరాబాద్​లో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కవిత ఆడిపాడారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు: సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి..రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటి చూట్టూ ఆడిపాడారు.

సత్తుపల్లిలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకుని.. బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.

మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కరీనంగర్ జిల్లా కేంద్రంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లుచేశారు. మెదక్‌లోనూ ఉత్సాహంగా మహిళలు సద్దుల బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. హన్మకొండలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు జాతరను తలపించాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం మహిళలు గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.

ఇవీ చదవండి: Special Bathukamma: 12 అడుగుల భారీ బతుకమ్మ సద్దుల స్పెషల్

ఈ శునకం ధర రూ.10 కోట్లు.. కిలోమీటరుకు మించి నడవదు.. రోజంతా ఏసీలోనే..

Last Updated : Oct 3, 2022, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.