ETV Bharat / state

Rythu Runamafi Telangana 2023 : వచ్చే నెల రెండో వారంలోపు రుణమాఫీ చెల్లింపులు పూర్తి..!

author img

By

Published : Aug 13, 2023, 10:08 AM IST

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు బ్యాంక్​ అప్పులను చెల్లించేందుకు సర్కారు అమలు చేస్తోన్న రుణమాఫీ ప్రక్రియ వేగవంతం కానుంది. పన్నేతర ఆదాయం ఖజానాకు సమకూరుతున్న నేపథ్యంలో చెల్లింపుల ప్రక్రియ ఊపందుకోనుంది. వచ్చే నెల రెండో వారం వరకు మొత్తం రుణమాఫీ చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

Runamafi Process in Telangana Farmers
Rythu Runamafi in Telangana 2023

Rythu Runamafi Telangana 2023 : అప్పుల భారంతో ఉన్న రైతన్నలకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.లక్షలోపు పంట రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.41 వేల వరకు అప్పు ఉన్న వారి ఖాతాల్లో నగదు జమచేశారు. ఇప్పటి వరకు 5 లక్షల 84 వేల మందికి పైగా రైతులకు రూ.1,374 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా దాదాపు 26 లక్షల మంది రైతులకు రూ.18,000 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెల రెండో వారం వరకు రుణమాఫీ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అందుకు అనుగుణంగా అధికారులు చెల్లింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నెలలో 62 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.238 కోట్లు జమ చేశారు. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేయాలని నిర్ణయించారు. ఖజానాకు డబ్బు వచ్చిన ప్రకారం చెల్లింపులు చేయనున్నారు. పన్నేతర ఆదాయం నుంచి వచ్చే మొత్తం ద్వారా రుణమాఫీ పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజునకు (ORR Lease Issue) సంబంధించి ఐఆర్​బీ సంస్థ రూ.7,380 కోట్లు హెచ్ఎండీఏకు ఇటీవల చెల్లించింది.

CM KCR on Rhythu Runa Mafi : రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి రుణమాఫీ రెండో విడత షురూ..

Loan waiver for Farmers 2023 : ఒకటి, రెండు రోజుల్లో ఆ మొత్తం ఖజానాకు జమ కానుంది. ఆ మొత్తం అందుబాటులోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చెల్లింపులు వేగవంతం చేయనున్నారు. అటు కోకాపేట నియోపొలిస్ లేఅవుట్ రెండో దశ వేలం ద్వారా రూ.3,319 కోట్లు, బుద్వేల్ భూముల (Budvel land auction) ద్వారా రూ.3,625 కోట్లు సర్కార్​కు సమకూరనున్నాయి. మోకిల ప్లాట్ల విక్రయం ద్వారా మరో రూ.121 కోట్లు రానున్నాయి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

MLAs Wishes to CM KCR : రైతు రుణమాఫీ నిర్ణయంతో సీఎం కేసీఆర్​కు అభినందనల వెల్లువ

Second Phase Loan Waiver Process Telangana : భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు రుసుముతో పాటు మొదటి దఫా లైసెన్స్ ఫీజు కలిపి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆదాయం అంతా సెప్టెంబర్ రెండో వారంలో రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని.. తద్వారా రుణమాఫీ చెల్లింపులు అన్నీ పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

BRS on Telangana Assembly Elections : మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్​ఎస్​ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న అంశాలను గుర్తించి వాటిని కార్యారూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే వీఆర్​ఏల సర్ధుబాటు, జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను శ్వాశత ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ కార్మికులును ప్రభుత్వ ఉద్యోగస్థులుగా గుర్తించడం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతు రుణమాఫీ ప్రక్రియా సైతం రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ

రాష్ర బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు

పంట రుణం.. పెను భారం.. రైతులకు బ్యాంకుల నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.