ETV Bharat / state

'హరీశ్​రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిపోయింది - 10 రోజుల్లో వచ్చి అన్నదాతలకు 15 వేలు ఇస్తాం'

Revanth Reddy on Rythu Bandhu Funds Release Permission Revoke : రైతుబంధు నిలిచిపోవడం పట్ల అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే.. 10 రోజుల్లో రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్​రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగానే సీఈసీ రైతుబంధు అనుమతి ఉపసంహరించుకుందని వెల్లడించారు.

Revanth Reddy
Revanth Reddy on Rythu Bandhu Funds Release Suspension
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 12:29 PM IST

Updated : Nov 27, 2023, 12:44 PM IST

Revanth Reddy on Rythu Bandhu Funds Release Permission Revoke : రైతుబంధును నిలిపివేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎక్స్​ (ట్విటర్) వేదికగా స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఆలోచన, ఉద్దేశం మామా-అల్లుళ్లకు (సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు) లేదని ఆయన ధ్వజమెత్తారు. హరీశ్​రావు నియమావళిని ఉల్లంఘిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిపారు.

  • రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.

    హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.

    ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk

    — Revanth Reddy (@revanth_anumula) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rythu Bandhu Funds Release Issue in Telangana ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్​రావు నియమావళిని ఉల్లంఘించడంతో ఈసీ తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్​ పేర్కొన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదన్న ఆయన.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. తాము అధికారంలోకి రాగానే పది రోజుల్లో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల లెక్కన అన్నదాతల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.

How to Apply for Rythu Bandhu : 'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేయాలి..? డబ్బులు పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

  • The Election Commission has held the Finance and Health & Family Welfare Minister, Harish Rao in violation of the Model Code of Conduct.

    Nobody else is to be blamed other than the ‘Gang of 4’ ruling Telangana, who in their desperation to hang onto power have ended up denying…

    — Jairam Ramesh (@Jairam_Ramesh) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదు. హరీశ్​రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే.. రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం." - రేవంత్​ రెడ్డి ట్వీట్

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు నాటకం ఆడుతున్నాయి..: బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ ఒకే తాను ముక్కలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కుటుంబ పార్టీలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టదని.. భారత్​ రాష్ట్ర సమితి, హస్తం పార్టీలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైతుబంధు విషయంలోనూ ఆ రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. అన్నదాతలపై అంత ప్రేమ ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం వస్తారు : కిషన్​రెడ్డి

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ ఒకేతాను ముక్కలు. రైతుబంధు విషయంలోనూ కాంగ్రెస్‌, బీఆర్​ఎస్ నాటకం ఆడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదు. కుటుంబ పార్టీలను మా పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టదు. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

అధికారంలోకి రాగానే చర్లపల్లి జైళ్లో కేసీఆర్​కు డబుల్ బెడ్​రూం ఇల్లు కట్టించడం ఖాయం: రేవంత్

'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ

Last Updated : Nov 27, 2023, 12:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.