ETV Bharat / state

ముషీరాబాద్​ చేపల మార్కెట్‌లో భారీ రద్దీ - చేప‌ల మార్కెట్ల‌లో తీవ్ర ర‌ద్దీ

హైద‌రాబాద్​లోని పలు చేప‌ల మార్కెట్ల‌లో ఇవాళ తీవ్ర ర‌ద్దీ నెల‌కొంది. మృగ‌శిర కార్తె కావ‌డంతో ముషీరాబాద్ మార్కెట్‌కు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భౌతిక దూరం పాటించ‌ని ప‌లువురిపై పోలీసులు జరిమానా విధించారు.

Fish market
Fish market
author img

By

Published : Jun 8, 2021, 5:05 PM IST

మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​లో భారీ రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కొనుగోలుదారులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. డిమాండ్ దృష్ట్యా చేపల ధరలు భగ్గుమన్నాయి. సాధారణంగా కిలో రూ. 600 అమ్మే కొర్రమీను రూ. 800 పలికింది. రవ్వ తదితర చేపలు కిలో రూ. 100 ఉండగా నేడు రూ. 200కు విక్రయించారు. నేడు ఒక్కరోజే ఏపీ నుంచి దిగుమతి అయిన సుమారు 300 క్వింటాళ్ల చేపల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోన్నా.. నేడు చేపలు తింటే శక్తిని పెంపొందిస్తాయనే విశ్వాసంతో ప్రజలు భౌతిక దూరం వంటి నియమాలు కూడా పాటించకుండా మార్కెట్​కు ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్​కు చేరుకుని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​లో విధించిన జరిమానాలు రద్దు చేయండి: నిరంజన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.