ETV Bharat / state

RuKart Eco Friendly Subjee Cooler : రుకార్ట్ సబ్జీ కూలర్​.. ఇది ఉంటే చెంత.. రైతులు, చిరు వ్యాపారులకు ఇక నిశ్చింత

RuKart Eco Friendly Subjee Cooler for Vegetables and Fruits : పంట కోతలు, రవాణా, నిల్వ సమయాల్లో రైతులు, చిరు వ్యాపారులు నష్టాలు మూటగట్టుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే నాబార్డు సాయంతో ఐఐటీ ముంబయి విద్యార్థులు ఆవిష్కరించిన రుకార్ట్ సబ్జీ కూలర్ వారికి ఎంతో ఉపయుక్తంగా మారుతుందంటున్నారు నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఆ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం(Technical Knowledge) వల్ల విద్యుత్, ఇంధనం లేకుండానే కూరగాయలు రెండు నుంచి వారం రోజుల పాటు నాణ్యత దెబ్బ తినకుండా తాజాగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.

RuKart Eco Friendly Subjee Cooler for Vegetables and Fruits
RuKart Eco Friendly Subjee Cooler
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 1:09 PM IST

RuKart Eco Friendly Subjee Cooler రుకార్ట్ సబ్జీ కూలర్​ ఇది ఉంటే చెంత రైతులు చిరు వ్యాపారులకు ఇక నిశ్చింత

RuKart Eco Friendly Subjee Cooler for Vegetables and Fruits : వ్యవసాయంలో పంట కోతల అనంతరం నష్టాలు సహజం. ఏటా సీజన్‌ ఆరంభంలో రుతు పవనాలు(Monsoons) దోబూచులాడుకుంటున్నా.. అన్నదాతలు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమిస్తారు. సాగు చేసిన పంటలు ప్రకృతి కరుణిస్తే చేతికొస్తాయి. లేదంటే అంతే సంగతి. అంతేగాక పంట చేతికొచ్చిన తర్వాత ఉత్పత్తులు అమ్ముకోవడానికి అన్నదాతకు పడరాని పాట్లు తప్పవు. ప్రత్యేకించి త్వరగా కుళ్లిపోయే కాయగూరలతో చిరు వ్యాపారులు(Small Traders) నష్టాలు మూటగట్టుకోవడం సర్వసాధారణంగా మారింది.

RuKart Eco Friendly Subjee Cooler : ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ ముంబయి(Indian Institute of Technology Mumbai) విద్యార్థులు ఓ ఆవిష్కరణను ముందుకు తెచ్చారు. విద్యుత్‌, ఇంధనం, సౌరశక్తి లేకుండా నడిచే రిఫ్రిజరేటర్‌ రూపొందించారు. కేవలం నీటితో పని చేస్తుండటంతో హైదరాబాద్‌ కుకట్‌పల్లిలోని పలువురు వ్యాపారులు సబ్జీ కూలర్‌(Rukart Sabjee Cooler)ను వినియోగిస్తున్నారు.

Sangareddy Small Traders Market Problems : సంగారెడ్డి మార్కెట్ షాపులకు జూదగాళ్లు, మందుబాబులకు ప్రత్యేకం..!

నీరు నింపితే.. రెండు రోజుల పాటు తాజాగా..: వ్యాపార సామర్థ్యం బట్టి 50 కిలోల నుంచి 100 కిలోల వరకూ నాణ్యమైన నమూనాలు రూపొందించి అందుబాటులో ఉంచారు. పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు తప్ప.. మిగతా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇందులో నిల్వ చేసుకోవచ్చు. ప్రతి 24 గంటలకోసారి నీరు నింపి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిల్వ చేస్తే.. అవి కనీసం రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

'మేము రైతుల దగ్గర నుంచి తెచ్చిన ఐటెమ్స్ అన్నీ గ్రేడ్ చేసుకుంటాం. మా దగ్గర ఫ్రెష్​గా ఉన్నవి సెపరేటుగా చేస్తాం. కూలర్ బాగా పని చేస్తుంది. ఆకుకూరలు అన్నీ మేము కూలర్​లోనే పెడతాం. మాకు ఎప్పడూ ఫ్రెష్​గానే ఉంటున్నాయి.' -ప్రసాద్, కూరగాయల వ్యాపారి

RuKart Eco Friendly Subjee Cooler in Telangana 2023 : సాధారణంగా శీతల గిడ్డంగులు లేదా రిఫ్రిజిరేటర్​లో పెట్టి నిల్వ చేస్తే క్లోరోఫార్మ్ కార్బన్స్(Chloroform Carbons) ప్రభావంతో కూరగాయలు, ఆకుకూరలు తిన్న వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా ఆ ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలు కోల్పోయి మనిషికి అందాల్సిన శక్తి అందదని రుకార్ట్ సంస్థ మేనేజర్‌ తెలిపారు. ఈ నెల 27వ తేదీన వికారాబాద్‌లో నాబార్డు(National Bank for Agriculture and Rural Development) ఆధ్వర్యంలో కేశవపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ఈ రుకార్ట్ సబ్జీ కూలర్‌తో పాటు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technical Knowledge) అందించనున్నారు.

'20 లీటర్ల నీటితో 24 గంటల పాటు ఏ కూరగాయలైనా ఫ్రెష్​గా ఉంచుకోవచ్చు. మళ్లీ 24 గంటల తర్వాత నీటిని నింపుకొని ఇలా కూరగాయలను బట్టి నిల్వ చేసుకోవచ్చు. ఆకు కూరలైతే రెండు నుంచి మూడు రోజులు నిల్వ చేయొచ్చు. మిగతా కూరగాయలు ఏవైనా ఐదు నుంచి వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.'-చంద్రమౌళి ప్రతాపరావు, రూకర్ట్ సబ్జీ కూలర్ మేనేజర్

Uncultivated Leafy Vegetable Festival : 'సాగు చేయని ఆకు కూరల్లో.. పోషకాలు మెండు'

Vegetables Price Dropped in Telangana : సామాన్యుడా ఊపిరిపీల్చుకో.. కూరగాయల ధరలు దిగొచ్చాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.