ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు మహిళా సంఘాల నేతలు కీలక పాత్ర పోషించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. మహిళలపైన జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాల నేతలు చేసిన పోరాటం.. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమాదేవీలను తలపించారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సోమవారం నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ఉద్ధృతంగా ఉంటుందని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి : ఉద్రిక్తంగా మారిన 'ఆర్టీసీ మిలియన్ మార్చ్'