ETV Bharat / state

ఎర్రబస్సు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు - tsrtc employees strike -2019

అరకొరగా తిరుగుతున్న బస్సులతో విద్యార్థులు, ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తూ... వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్మికులపైనే కాదు ప్రతి రోజు ఎర్రబస్సులో తిరిగే 33 లక్షల ప్రయాణికులపైనా పడింది.

ఎర్రబస్సు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
author img

By

Published : Nov 8, 2019, 5:16 AM IST

Updated : Nov 8, 2019, 7:51 AM IST

ఎర్రబస్సు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

నెల రోజులుగా ప్రగతి చక్రం తిరగట్లేదు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలపైనా పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రజలను ఆ సమస్య మరింత తీవ్రంగా వెంటాడుతోంది. బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సులు లేక ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. గత నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె నేటికి 36వ రోజుకు చేరుకుంది. అప్పటినుంచి బస్సులు లేక, ప్రైవేటు వాహనాల దోపిడీ తట్టుకోలేక సామాన్యులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

పాసులున్నా.. డబ్బులే తీసుకుంటున్నారు..

పాస్‌లు ఉన్నా కొంతమంది కండక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం 90 శాతం బస్సులు నడుపుతున్నామని చెబుతున్నా... వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు.

మహిళల బాధ వర్ణనాతీతం..

బస్సులు లేక మహిళా ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరి మధ్య నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. రాత్రి ఏడు దాటితే బస్సుల జాడలేక... ఇళ్లకు చేరేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇదీ చదవండిః 'ఉమ్మడి ఎజెండాను అమలు చేస్తున్నారు'

TG_HYD_60_07_RTC_STRIKE_FACING_PROBLEMS_ON_PEOPELS_PKG_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ కెమెరామెన్‌: ( ) అరకొరగా తిరిగే బస్సు కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగస్తులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మోయలేని పుస్తకాల బ్యాగులతో కుస్తీ పడుతూ బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడో ఒక బస్సు కిక్కిరిసి వస్తే వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అంతం కాదిది ఆరంభంలా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం... గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్మికులపైనే కాదు... ప్రతి రోజు ఎర్రబస్సులో తిరిగే 33 లక్షల ప్రయాణికులపైనా పడింది. రెండు మాసాలుగా జీతాలందక ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు ఒక వైపు... ప్రైవేట్‌ వాహానాల్లో ప్రయాణం భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న సామాన్య ప్రజానీకం వెతలు మరో వైపు...........LOOK VO.1: ప్రగతి చక్రం తిరగకపోవడంతో దాని ప్రభావం రాష్ర్ట వ్యాప్తంగా సామాన్య ప్రజలపై పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రజలను ఈ సమస్య మరింత తీవ్రంగా వెంటాడుతోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగస్తులు నానాపాట్లు పడుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె నేటికి 34వ రోజుకు చేరుకుంది. నెల రోజులుగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సలులేక ప్రైవేట్‌ వాహానాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వాహానాల యజమానులు ధరలను అమాంతంగా పెంచేసి జేబులు నింపుకుంటున్నారు.........SPOT VO.2: ఎర్రబస్సును నమ్ముకున్న సామాన్య ప్రజానీకం 9 వందలతో బస్సు పాస్‌ తీసుకొని నెల రోజుల పాటు ప్రయాణం చేసేది. ప్రగతి చక్రం ఆగిపోవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బస్సులు లేకపోవడంతో ప్రైవేట్‌ వాహానాల్లో ప్రయణిస్తూ రోజుకు వంద నుంచి 150 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం చిన్నా చితకా ఉద్యోగులు, విద్యార్థులపైన తీవ్ర ప్రభావం పడింది. చిరు ఉద్యోగులకు వచ్చే అరకొర జీతంలో ఖర్చు తడిసి మోపెడవుతోంది. నెలకు పది వేలు సంపాదించే ఉద్యోగికి నెల బస్‌ పాస్‌కు 750 ఖర్చవుతుంది. బస్సులు లేకపోవడంతో రోజుకు వంద నుంచి 130వరకు ప్రయాణానికి ఖర్చు చేస్తున్నాడు. సమ్మె ప్రభావంతో నెలకు సామాన్యుడి ప్రయాణ ఖర్చు 7వందల 50 నుంచి 3వేల 9వందలకు చేరింది. ఇంటి అద్దె 5 వేలు. వచ్చే ఆదాయంలో ఉద్యోగికి చివరికి 11 వందలు మాత్రమే మిగిలాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థి బస్‌ పాస్‌ ఖర్చు నెలకు 130... ప్రస్తుతం రోజుకు రానుపోను వంద నుంచి 130 ఖర్చవుతుంది. ఒక్కో విద్యార్థి నెలకు 3వేల 9వందలు ఖర్చు చేసిన సమయానికి ఇంటికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.............BYTES బైట్స్‌: VOXPOP VO.3: ప్రభుత్వం 90 శాతం మేర బస్సులు నడుపుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. ప్రజలకు ఎలాంటి తలెత్తకుండా బస్సులు నడుపుతున్నామని చెప్పుకోవడానికే ప్రభుత్వం కేవలం ప్రధాన రూట్లలో ఆడపాదడపా నడుపుతోంది. గ్రామ శివార్లలోకి ఒక్క బస్సు కూడా వెళ్లకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రూట్లలోనూ ఉదయం 9 తరవాతే బస్సులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. రాత్రి 7 గంటలు దాటితే ఒక్క బస్సు రోడ్లపై కనిపించడంలేదు. రాత్రి వేళల్లో మహిళలు బస్‌ స్టాప్‌ల వద్ద భయపడుతూ పడిగాపులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వ మొండి వైఖరి మధ్య తాము నలిగిపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు........BYTES బైట్స్‌: VOXPOP END P TO C - JYOTHIKIRAN
Last Updated : Nov 8, 2019, 7:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.