ETV Bharat / state

తిరుగు ప్రయాణికులకు... ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు - ఏపీఎస్​ఆర్టీసీ

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వచ్చి..తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ.. ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై విశాఖ నగరాలకు విజయవాడ నుంచి 300 సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ కృష్ణా రీజియన్ వెల్లడించింది.

apsrtc
ఏపీఎస్​ఆర్టీసీ
author img

By

Published : Jan 17, 2021, 9:52 AM IST

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు ఆది, సోమవారాల్లో మెుత్తం 2,494 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ రెండురోజుల్లో ఆర్టీసీ అధికారులు.. కేవలం హైదరాబాద్​కు 631 బస్సులు వేశారు. ఆదివారం హైదరాబాద్​కు 359, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 59, విశాఖకు 125, బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. సోమవారం కూడా మెుత్తం 540 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) బ్రహ్మనందరెడ్డి తెలిపారు. మంగళ , బుధవారాల్లో అవసరమైతే నడుపుతామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.