Sahasrabdhi Vedukalu : ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజల సహస్రాబ్ది ఉత్సవాలకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 14 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ముచ్చింతల్‌కు రాకపోకలు సాగించేలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రతి గంటకు బస్సు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
బస్సు రూట్ల వివరాలు..
- పటాన్చెరు - లింగంపల్లి - గచ్చిబౌలి - శంషాబాద్.
- కేపీహెచ్‌బీ కాలనీ - కూక్‌ట్‌పల్లి - ఎస్‌ఆర్‌నగర్ - పంజాగుట్ట - మెహిదీపట్నం.
- మేడ్చల్ - కొంపల్లి - బాలనగర్ - మెహదీపట్నం.
- అల్వాల్ - జేబీఎస్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ - అఫ్జల్‌గంజ్ - జూపార్క్.
- ఘట్కేసర్ - ఉప్పల్ - ఎల్‌బీనగర్ - మిథాని.
- ఈసీఐఎల్ - తార్నాక - ఫీవర్ ఆసుపత్రి - నారాయణగూడ - లక్డీకాపూల్ - మెహిదీపట్నం.
- హయత్‌నగర్ - దిల్‌సుఖ్‌నగర్ - ఎంజీబీఎస్ రూట్లలో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
రైల్వే స్టేషన్ల నుంచి..
నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, రైల్వేస్టేషన్ల నుంచి ముచ్చింతల్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ స్టేషన్ల నుంచి ఉదయం 6,7,8 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
- కాచిగూడ రైల్వేస్టేషన్ - అఫ్జల్‌గంజ్ - జూపార్కు
- నాంపల్లి రైల్వే స్టేషన్ - అఫ్జల్‌గంజ్ - జూపార్క్ మీదుగా ఆరాంఘర్ - ముచ్చింతల్
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ - ఫీవర్ ఆసుపత్రి - అఫ్జల్‌గంజ్ - జూపార్కు మీదుగా ఆరాంఘర్ -ముచ్చింతల్‌కు బస్సు సర్వీసులు ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది.
ఇదీ చూడండి: వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. వేదపారాయణాల మధ్య అంకురార్పణ