RTC MD Sajjanar : ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. అర్ధరాత్రి వేళ ఓ యువతి చేసిన ట్వీట్‌కు సంస్థ ఎండీ సజ్జనార్ తక్షణమే స్పందించారు. బస్సు ప్రయాణాల్లో మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్వీట్లో ఓ యువతి ప్రస్తావించారు. పెట్రోల్ పంప్‌ల వద్ద 10 నిమిషాలు ఆపితే వాష్ రూమ్స్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని పాలే నిషా అనే యువతి ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు.
యువతి ట్వీట్‌కు స్పందించిన సజ్జనార్... విషయాన్ని ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. అర్ధరాత్రి వేళ మహిళ సమస్యపై సజ్జనార్ స్పందించడంతో... పాలే నిషా ఆనందం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
-
Already given instructions in this regard@TSRTCHQ @CTMTSRTC @CTMMNCTSRTC
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Already given instructions in this regard@TSRTCHQ @CTMTSRTC @CTMMNCTSRTC
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022Already given instructions in this regard@TSRTCHQ @CTMTSRTC @CTMMNCTSRTC
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 11, 2022
ఇదీ చదవండి: Panthangi toll plaza traffic : సంక్రాంతి సందడి.. పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ