విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై.. మలక్‌పేట్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆర్టీసీ డ్రైవర్ జగన్మోహన్రెడ్డిని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చును సంస్థ భరిస్తుందని భరోసా ఇచ్చారు.
కంటోన్మెంట్ డిపోకు చెందిన డ్రైవర్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులోని 30 మంది ప్రయాణికులను కాపాడారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించి.. జగన్ వైద్యానికి అయ్యే ఖర్చును ఆర్టీసీ సంస్థ భరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: 'వంట చేయనంటున్న ఏజెన్సీలు.. బతిమాలుతున్న ఉపాధ్యాయులు'