ETV Bharat / state

Bus Ticket Fare: ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే: మంత్రి అజయ్​కుమార్​ - rtc fare hike

కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి వస్తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మరోసారి ఛార్జీల పెంపు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్​కు తెలియజేసి వాటిని ఆమోదించాలని కోరుతామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలు మళ్లీ బాట పట్టాలంటే ఛార్జీలు పెంచాల్సిందే అని అన్నారు.

Bus Ticket Fare:  ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే: మంత్రి అజయ్​కుమార్​

author img

By

Published : Dec 2, 2021, 3:32 AM IST

కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసిందని.. దాని ప్రభావం ఆర్టీసీ సంస్థపై పడిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆర్టీసీపై అధిక భారం పడిందన్నారు. ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే అని అన్నారు. ఖైరతాబాద్​లోని రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్​, ఎండీ సజ్జనార్​లతో కలిసి మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఛార్జీల పెంపు అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర ఆర్టీసీలో ఆర్థిక సమస్యలతో ఆందోళన కొనసాగుతుందని... సుమారు 6వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారన్నారు. కానీ టీఎస్ఆర్టీసీ ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని తట్టుకుని అందరిని కాపాడి కడుపులో పెట్టుకుని ఆర్టీసీ ప్రగతి చక్రాలను పట్టాలెక్కించిందన్నారు. దీంతో నవంబర్ నెలకు ఆర్టీసీ ఆదాయం రోజుకి రూ.11.5 కోట్లకు చేరుకుందన్నారు. ఇప్పటి వరకు 27శాతం డీజిల్ ధరలు పెరిగాయని.. అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. ఎండీ సజ్జనార్​ ఇటీవల ఆర్టీసీ అంశాలపై ఓ సర్వే చేశారని మంత్రి పేర్కొన్నారు. ఆ సర్వేలో కేవలం 4.3 శాతం ప్రజలు మాత్రమే ఛార్జీల పెంపును వ్యతిరేకించారన్నారు. మిగతా వాళ్లు ఇతరత్రా సమస్యలను మాత్రమే చర్చించారన్నారు. అందుకే పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్​కు రూ.25 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్​కు రూ.30పైసలు పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించామన్నారు.

డీజిల్​ ధరలు పెంచడం వల్లే..

కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడం వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని, స్పేర్ పార్ట్స్ వాటి కొనుగోలు వల్ల రూ.3,000ల కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోయిందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్​ తెలిపారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీఎం కేసీఆర్​తో మాట్లాడి ఆర్టీసీ తరపున ప్రతిపాదించిన ప్రతిపాదనలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాలకు బస్సులు నడపాలనుకున్నప్పుడు సరైన బస్సులు అందుబాటులో లేవన్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో 643 బస్సులు స్క్రాప్ అయిపోయాయన్నారు. మరో 1,400ల బస్సుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుదామన్న ఎక్కలేని పరిస్థితి ఉందని ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఛార్జీల పెంపు చాలా అవసరం..

కేవలం డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకీ రూ.468 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రూ.2,330 కోట్ల నష్టం, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.1,440 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రగతిరథ చక్రాలు మళ్లీ బాటపట్టాలంటే ఛార్జీల పెంపు చాలా అవసరముందన్నారు. గతంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛార్జీల పెంపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఛార్జీలు పెంచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. .

కోట్లలో ఆదాయం

రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కిలోమీటర్​కు రూ.20 పైసల చొప్పున ఆర్టీసీ పెంచింది. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో 10పైసలు పెంచింది. తాజాగా మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్​కు రూ.25 పైసలు పెంచడం వల్ల జిల్లాల నుచి రూ.568.16 కోట్లు, సిటీ బస్సుల నుంచి రూ.127.90 కోట్లు..మొత్తం కలిపి రూ.696.06 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. డీలక్స్, మెట్రో, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు కిలోమీటర్ కు రూ.30 పైసలు పెంచడం వల్ల జిల్లాల నుంచి రూ.700.68 కోట్లు, సిటీ బస్సుల నుంచి రూ.166.01 కోట్లు.. మొత్తం కలిపి రూ.866.69 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీంతో పాటు ఆర్టీసీ మరో ప్రతిపాదన కూడా తయారు చేసింది. కొన్ని లగ్జరీ బస్సులకు కిలోమీటర్​కు రూ.35 పైసలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలా పెంచడం వల్ల జిల్లాల బస్సుల నుంచి రూ.855.87 కోట్లు, సిటీ బస్సుల నుంచి రూ.177.80 కోట్లు... మొత్తం కలిపి రూ.1,033.68 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి సీఎం కేసీఆర్ ఏ బస్సులకు ఎంత మేరకు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇస్తారో వేచి చూడాల్సిందే.

ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది. వచ్చే ఆదాయంతో కొన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

Bus Ticket Fare Hike: 'సీఎం నిర్ణయం తర్వాతే బస్​ ఛార్జీల పెంపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.