ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో గుర్తింపు సంఘం ఘోరంగా విఫలమైందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. 2017 ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సంస్థను ప్రజలు తమదిగా భావిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు బాలరాజు అన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టి.. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: ఓఆర్ఆర్ ప్రమాదంలో వ్యక్తి మృతి.. కారులో డ్రగ్స్!