ఆర్టీసీ సమ్మె 20 వ రోజుకు చేరుకున్న సందర్భంగా... సికింద్రాబాద్ రాణిగంజ్ డిపోకు చెందిన ఉద్యోగులు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌ను కలిశారు. తమ వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చొరవ చూపాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పద్మారావు నాయకత్వంలోనే పలు కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. కార్మికుల కష్టాలు తెలిసిన పద్మారావు.. తమ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. డిమాండ్ల పరిశీలన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని... త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని పద్మారావు వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్