ఏపీలోని కడప ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ సుధాకర్‌కు బస్సు నడుపుతుండగా గుండెపోటు వచ్చింది. తనకు తానుగానే అప్రమత్తమై.. సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. కడప నుంచి రాజంపేటకు వెళ్తుండగా దారిలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు సుధాకర్‌ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగినప్పుడు బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయట పడ్డారు. 55 సంవత్సరాలు దాటిన డ్రైవర్లను సుదూర ప్రాంతాలకు విధుల నిమిత్తం పంపించరాదన్న నిబంధన ఉన్నప్పటికీ డిపో అధికారులు ఉల్లంఘంచడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. సుధాకర్ ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నాడని, అతని డిపో పరిధిలోపే విధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్ షో"