ETV Bharat / state

నష్టాల్లో టీఎస్​ఆర్టీసీ... ఆందోళన చెందుతున్న యాజమాన్యం - వార్షిక ఆదాయం

టీఎస్​ఆర్టీసీ నష్టాలను మూటగట్టుకుంటుంది. గడిచిన మూడేళ్లలో ప్రతి ఏటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ సంస్థ ఆదాయానికి, ఖర్చులకు మధ్య వ్యత్యాసం భారీగానే ఉంటుందని... దీంతో నష్టాలు తప్పడంలేదని యాజమాన్యం పేర్కొంటుంది. మూడేళ్లలో ఆర్టీసీకి రూ.1,786.90 కోట్ల నష్టం వాటిల్లింది.

rtc-continues-loses-annual-gross-from-past-three-years
నష్టాల్లో టీఎస్​ఆర్టీసీ... ఆందోళన చెందుతున్న యాజమాన్యం
author img

By

Published : Mar 28, 2021, 2:59 PM IST

ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది కరోనా వల్ల లాక్​డౌన్ విధించడంతో ఆర్టీసీ బస్సులు నెలల తరబడి డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి ప్రజా రవాణా రోడ్డెక్కినా... నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీఎస్ఆర్టీసీలో మొత్తం 9,666 బస్సులు ఉన్నాయి. వీటిలో 6,520 సొంత బస్సులు, 3,246 అద్దె బస్సులు ఉన్నాయి.

మూడేళ్లలో వరసగా రూ.928 కోట్లు, రూ.వెయ్యికోట్లు, రూ.1,786 కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ విధంగా చూస్తే ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా... తగ్గడంలేదని ఆర్టీసీ గణాంకాలే చెబుతున్నాయి. అధికారులు, కార్మికుల సమిష్టి కృషితోనే నష్టాల నుంచి విముక్తి లభిస్తుందని యాజమాన్యం భావిస్తుంది.

ఇటీవలే ప్రభుత్వం బడ్జెట్​లో రూ.3వేల కోట్లు కేటాయించడంతో కార్మికసంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీకి నష్టాల నుంచి కొంచెం విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాయి.

గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయ, వ్యయాలు

ఆదాయంఖర్చులునష్టం
2018-19రూ.4,882.72కోట్లురూ.5,811.39 కోట్లురూ.928.67
2019-20రూ.4,592.93 కోట్లురూ.5,594.95కోట్లురూ.1,002.02 కోట్లు
2020-21రూ.907కోట్లురూ.2,694.09 కోట్లురూ.1,786.90 కోట్లు

ఇదీ చూడండి: 'అదనపు ఆదాయం కోసం ఉద్యోగులపై ఒత్తిడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.