వాహన పన్ను చెల్లించకుండా అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలపై రవాణ శాఖ కొరడా ఝులిపించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో ఆరు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, బెంగళూరు రూట్లలో శుక్రవారం అర్ధరాత్రి నుండి అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. రాష్ట్రానికి త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై 60 కేసులు నమోదు చేయడంతో పాటు... 14 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు 50 లక్షల రూపాయల జరిమానా విధించిన్నట్టు రవాణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: నేడు జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక