భారతదేశ ధర్మాన్ని కొందరు కుహనా మేధావులు వక్రీకరిస్తున్నారని, ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఎన్సీసీ సమష్టి సేవ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పురస్కారాన్ని దీన్ దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు అందించారు.
'భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ భిన్నత్వాలు ఏకత్వం కావాలి' అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. భారతదేశం చిరంజీవమైనదని, ప్రపంచ శాంతికి తన వంతు పాత్ర పోషిస్తోందని, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మటమే భారతదేశం గొప్పతనమని పేర్కొన్నారు. దేశంలోని సత్యాన్ని, ధర్మాన్ని నిలపెట్టడం, ప్రచారం చేయటం కోసం సంఘ్ పని చేస్తోందని అన్నారు.
ఇవీ చూడండి: బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రారంభమైన ఆర్థికశాఖ కసరత్తు