ETV Bharat / state

RS Praveen Kumar on KCR : 'మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. దోపిడీ చేసే నాయకులను..' - తెలంగాణ వార్తలు

RS praveen Kumar on KCR : ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే దోపిడీ వర్గాలకు ప్రతినిధిగా ఉన్న సీఎం కేసీఆర్​ లాంటి నాయకులను మార్చాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని ప్రజలను కోరారు.

RS praveen Kumar comments  on KCR, rs praveen kumar tweet
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్​ప్రవీణ్ కుమార్ స్పందన
author img

By

Published : Feb 2, 2022, 11:05 AM IST

RS praveen Kumar comments on KCR : రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మార్చాల్సింది మహానీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదని... వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్​ లాంటి నాయకులనంటూ విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్​ విషయంలో సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విటర్​ వేదికగా స్పందించారు.

  • KCR, ఇప్పుడు మార్చాల్సింది మహనీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదు, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజల కష్టార్జితాన్ని యధేచ్చగా దోపిడీచేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న నీలాంటి నాయకులను. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్దం కావాలని ప్రజలకు విజ్ఞప్తి. pic.twitter.com/6sQFnjH02A

    — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసీఆర్​ ఏమన్నారంటే...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్​, భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు.

'దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికి 80 సార్లు సవరించారు. దేశాన్ని బాగు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉంది. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయి. మన దేశంలోనూ అది జరగాలి. ప్రపంచంలోనే వివిధ వనరులతో అత్యంత శక్తిమంతమైన దేశంగా..నీళ్లు అందుబాటులో ఉన్నా సాగు, తాగునీరు అందట్లేదు. విద్యుత్‌ ఉన్నా 65 శాతం దేశ ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఎంతకాలం దేశ ప్రజలను అంధకారంలో ఉంచుతారు. దేశంలో మార్పు తీసుకురావాలని ప్రజలను కోరుతున్నా. దీని ద్వారా భారత్‌ అగ్రదేశంగా మారవచ్చు. ఇప్పటివరకు దేశ పాలనలో కాంగ్రెస్‌, భాజపాలు విఫలమయ్యాయి.'

-సీఎం కేసీఆర్

Cm Kcr on Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్... మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారన్న సీఎం... ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుందని తెలిపారు. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉందని చెప్పారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఆరోపించారు. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా... బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం అని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆత్మవంచన చేసుకుని... దేశ ప్రజలను వంచించారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Cm Kcr on Budget: బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.