ETV Bharat / state

RS Praveen Kumar Comments on KCR : "అసైన్డ్ భూముల బలవంతపు ఆక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్ వేస్తాం" - బీఎస్ఫీ పార్టీ ఎన్నికల ప్రచార లోగో

RS Praveen Kumar Latest Comments : రాష్ట్రంలో అసైన్డ్​ భూములను ప్రభుత్వమే తీసుకుని రియల్​ ఎస్టేట్​ చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆరోపించారు. రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎన్నికల ప్రచార లోగోను ఆయన ఆవిష్కరించారు. త్వరలో అసైన్డ్​ భూముల విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తామని ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రకటించారు.

RS Praveen Kumar Latest Comments
RS Praveen Kumar Latest Comments
author img

By

Published : Jul 31, 2023, 4:26 PM IST

RS Praveen kumar fire on KCR : రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకొని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలోని అసైన్డ్ భూముల ఆక్రమణలపై ప్రజెంటేషన్ విడుదల చేశారు. తదనంతరం ఎన్నికల ప్రచారాల లోగోను ఆవిష్కరించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ - ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు. బహుజనవాదం బలపడడంతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఉత్తరాది నుంచి పిలిపించారని ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్‌ను తీసుకొచ్చి దళితులకు జరిగిన అన్యాయం కప్పిపుచ్చే యత్నం చేశారని విమర్శించారు.

RS Praveen kumar comments on CM : పేదల అసైన్డ్ భూముల్లో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఫామ్​హౌస్​లలో డంపింగ్ యార్డ్​లు, శ్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు చాలా రాష్ట్రాలు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తుంటే.. రాష్ట్రంలో దీనికి భిన్నంగా అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకి ఇస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్​ వ్యక్తులకు ఇచ్చిన అసైన్డ్ భూములపై విచారణ జరిపిస్తామన్నారు. అసైన్డ్ భూముల బలవంతపు ఆక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్ వేస్తామన్నారు.

RSP Fires on CM KCR : 'కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా..?'

వరద ముంపు ప్రాంతాల వారికి వంద కోట్లు ప్యాకేజీ ఇవ్వాలి : భారీ వర్షాలకు వాగులు దాటుతూ చనిపోయిన వారంతా బహుజన వర్గాల వారే ఎక్కువ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వంతెనలు నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదన్నారు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన మోరంచపల్లి, కొండాయి ప్రాంతాలకు ప్రభుత్వం వంద కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఇళ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ కట్టించుకుని భూములు రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వం, అసైన్డ్ భూములను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. కానిస్టేబుల్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసే జీవో నెం 46ను ప్రభుత్వం తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం, టీఎస్​పీఎస్​సీ పేపర్ లీకేజీలు, ఎమ్మేల్యేల ఆక్రమణల కబ్జాలు, పంచాయతీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

ప్రభుత్వ ఆక్రమణలపై ప్రెజెంటేషన్​ : బీఎస్పీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల దగ్గర ప్రభుత్వం తీసుకుంటున్న అసైన్డ్ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారు. అసైన్డ్ భూముల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.వెంకటేష్ చౌహాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్, రాష్ట్ర సెక్రెటరీ గుండెల ధర్మేంధర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాచమల్ల జయసింహ, భూ రక్షణ సమితి నాయకులు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

"అసైన్డ్​ భూములను, వెంచర్​లను అమ్మమని ఏ చట్టంలో ఉందని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 30 వేల ఎకరాలను పేదవారి నుంచి రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ పేదవారికి మంచి చేస్తానని చెప్పి వారి భూములను గుంజుకుంటున్నారు. వాటిని కొన్ని గ్రూపులకి ఇస్తున్నారు. ఇవన్నీ మంత్రి కేటీఆర్​కి తెలియకుండా జరుగుతున్నాయా అని ప్రశ్నిస్తున్నాను. "- ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ మీడియా సమావేశం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.