రైతులకు త్వరలో రబీ పంటకు సంబంధించిన రైతుబంధు నిధులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంటపెట్టుబడి మద్దతు పథకం కోసం 5100 కోట్ల రూపాయల నిధులు విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు.
2019-20 బడ్జెట్లో రైతుబంధు కోసం 12వేలా 862 కోట్ల రూపాయలు కేటాయించగా... ఖరీఫ్‌లో 6862 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా మరో 5100 కోట్ల రూపాయల విడుదలకు ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ కూడా రబీ రైతుబంధు కోసం నిధులు విడుదల చేస్తూ అనుమతిచ్చింది. నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కావడంతో వీలైనంత త్వరగా రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయనుంది.
ఇవీ చూడండి:ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం