ఆర్ అండ్ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. గతంలో ఆర్ అండ్ బీ శాఖలో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల మేర మాత్రమే పనులు జరిగేవని ఆయన తెలిపారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.750 కోట్లు కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డు సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏడేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు: రాజగోపాల్‌రెడ్డి