ETV Bharat / state

KODANDAREDDY: వర్షాలకు దెబ్బదిన్న పంటలకు పరిహారం చెల్లించాలి - telangana varthalu

సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటల జాబితాలు సిద్ధం చేసి రైతులకు నష్టపహారం(crop damage insurance) చెల్లించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎ.కోదండరెడ్డి అన్నారు. ఇకనైనా గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ తరహాలో కొత్త బీమా పథకం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

KODANDAREDDY: 'ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి'

author img

By

Published : Oct 1, 2021, 4:43 PM IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల బారినపడి పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం(crop damage insurance) చెల్లించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎ.కోదండరెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో 'ప్రకృతి వైపరీత్యాలు - ప్రభుత్వ బాధ్యత' అన్న అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నేతలు, వివిధ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. 2020 ఖరీఫ్ సీజన్‌లో సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటల జాబితాలు సిద్ధం చేసి రైతులకు నష్టపహారం చెల్లించాలని, కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్ల సమయంలో నెల రోజుల ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి బీమా పథకం అమలు చేయాల్సిన ప్రభుత్వం... ఉన్న పీఎంఎఫ్‌బీవై కొనసాగించకపోగా... మరో కొత్త పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం పట్ల రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇకనైనా గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ తరహాలో కొత్త బీమా పథకం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది వానాకాలంలో కూడా భారీ వర్షాలు, వరదల ప్రభావంతో నాలుగు నెలల్లో 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, బీమా పథకం అమల్లో లేకపోవడం వల్ల రైతులు పరిహారం(crop damage insurance) పొందే అవకాశం లేకపోవడంతో పూర్తిగా నష్టం చవిచూడాల్సి వచ్చిందని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌కుమార్ ఆరోపించారు. రైతుబంధు పథకం కింద ఏటా 10 వేల రూపాయలు ఇస్తున్నాం కదా... ఇక పంట బీమా పథకం అమలు చేయమంటే కుదరదని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించడంతోపాటు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Seethakka in Assembly sessions 2021: 'ప్రజా గొంతుకలను కట్‌ చేయడమే మీ లక్ష్యమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.