ETV Bharat / state

'కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్​ రాజ్యాంగం కావాలా' - బండి సంజయ్​ తాజా వ్యాఖ్యలు

Round Table Meeting: రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అణగారిన ప్రజల హక్కుల మీద దాడి చేయడమేనని తెజస అధినేత కోదండంరాం మండిపడ్డారు. చరిత్రను కనుమరుగు చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా ఆలోచన చేయాలని ఆయన తెలిపారు.

'కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్​ రాజ్యాంగం కావాలా'

author img

By

Published : Feb 12, 2022, 4:26 PM IST

Updated : Feb 12, 2022, 4:31 PM IST

Round Table Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మీద చేసిన వ్యాఖ్యలు అణగారిన ప్రజల హక్కుల మీద దాడి చేయడమేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ అన్నారు. రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాంతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, తదితర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో నిరసన చేసే హక్కులేకుండా పోయిందని.. నిరసన చేసినందుకు పార్టీలతో సంబంధంలేకుండా నాయకులను అరెస్టు చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాస మాత్రమే ఉండాలని వేరే పార్టీలు ఉండకూడదనే రీతిలో సీఎం వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.

తీవ్రంగా ఖండిస్తున్నా..

కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అణగారిన ప్రజల హక్కుల మీద దాడి చేయడమే. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. బానిసలుగా ఉండకూడదు అని అంబేడ్కర్ రాజ్యాంగం రాశారు. మనుషుల మధ్య అంతరాలు ఉండకూడదని అంబేడ్కర్ రాజ్యాంగం రాశారు. ఉద్యోగాలు రావడం లేదని యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో నిరసన చేసే హక్కు లేదు.. నిరసన చేసినందుకు పార్టీలతో సంబంధం లేకుండా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. -కోదండరాం, తెజస అధ్యక్షుడు

కల్వకుంట్ల రాజ్యాంగం కోసం..

చరిత్రను కనుమరుగు చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగం కోసం కేసీఆర్​ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. అంబేడ్కర్​ విగ్రహం కడతామని చెప్పి ఇప్పటివరకు కట్టలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను పక్కదారి పట్టించడానికే ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను ముందుకు తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగం వల్ల కేసీఆర్​కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. జనగామలో సభ ఎందుకు పెట్టిండో కేసీఆర్​కు కూడా తెలియదని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు.

చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారు..

కల్వకుంట్ల రాజ్యాంగం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా ఆలోచన చేయండి. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే కేసీఆర్​కు నచ్చదు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ చెప్పారు.. కానీ చేయలేదు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అంబేడ్కర్ విగ్రహం కడుతామని చెప్పి ఇప్పటివరకు కట్టలేదు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను పక్క దారి పట్టించడానికే మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను ముందుకు తీసుకువచ్చాడు. రాజ్యాంగం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంది కేసీఆర్ చెప్పు. జనగామ సభ ఎందుకు పెట్టిండో కేసీఆర్​కు తెలవదు.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్​ రాజ్యాంగం కావాలా'

ఇదీ చదవండి:

Last Updated : Feb 12, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.